తన కామెంట్లపై క్షమాపణలు చెప్పిన రాజా సింగ్!
- బీజేపీ రాజస్థాన్ ఎంపీ వ్యాఖ్యలు సమర్థించబోయి సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
- తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో పునరాలోచన
- తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెడితే క్షమించాలన్న ఎమ్మెల్యే
సినీ పరిశ్రమలోని మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. ఒక టీవీ ఛానెల్ లో జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ రాజస్థాన్ ఎంపీ వ్యాఖ్యలను సమర్ధిస్తూ, రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, కత్తి మహేష్ వంటి వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆయన ఆలోచనలో పడ్డారు. తాను తప్పుడు ఉద్దేశ్యంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని, తానెవరినీ కించపరచాలని భావించడం లేదని ఆయన అన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆయన కోరారు.